వరదలతో ఏపీ ప్రజలు అల్లాడుతుంటే రాజకీయ నాయకులు మాత్రం తమ మాటలతో ఒకరిపై ఒకరూ విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాన్ని రణరంగంగా మారుస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు వరద బాధితులకు సాయం అందించేందు పర్యటిస్తూ ప్రజల బాధలను తెలుసుకుని సాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కూడా వైసీపీ నేతలు రాజకీయంగా మార్చే పనిలో పడి మాటలతో విమర్శల దాడులు చేస్తున్నారు. వైసీపీ నేత విజయ సాయిరెడ్డి తాజాగా చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు.
తుఫాన్లను కంట్రోల్ చేశానంటాడు. సీమ వరదలు మానవ తప్పిదం అంటాడు. తాను ఏడిస్తే ఎవరూ పట్టించుకోవట్లేదంటాడు. తన బాధ ప్రపంచ బాధ అంటాడు. కుప్పం దెబ్బకు కకావికలమయ్యాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తాడట! మరి14 ఏళ్లు ఏం పీకాడని జనం చెవులు కొరుక్కుంటున్నారు. చంద్రబాబు వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళాడా? ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళాడో అర్థం కావడం లేదు. కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గిపుల్ల అన్నింటినీ తన రాజకీయాలకు వాడేస్తున్నాడు. వరద సమయంలో ఈ బురద రాజకీయాలు ఏంటో. వరద వచ్చి పోయినా మాకు ఈ బురద ఏంటంటున్నారు ప్రజలు. అంటూ ఘాటుగా ట్విట్టర్‌లో స్పందించారు. దీనిపై పలువురు చంద్రబాబు జనానికి సాయం చేయడానికి వెళ్లినా ఇలా ట్రోల్ చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.
