NTV Telugu Site icon

Janasena Party: నేడు ఉమ్మడి ప.గో. జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్

Pawan Kalyan

Pawan Kalyan

నేడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు. తొలుత హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న పవన్ కళ్యాణ్ అనంతరం రోడ్డు మార్గంలో కలపర్రు టోల్‌గేటు మీదుగా జానంపేట, అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా విజయరాయి, పెదవేగి, ధర్మాజీగూడెం, లింగపాలెంకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి మళ్లీ ధర్మాజీగూడెం మీదుగా చింతలపూడికి వెళ్తారు.

చింతలపూడికి చేరుకునే మధ్యలో పలు గ్రామాల్లో కొందరు కౌలు రైతుల కుటుంబాలను కలుసుకుని ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని పవన్ కళ్యాణ్ అందించనున్నారు. ఏలూరు, భీమవరం జిల్లాల్లో అప్పుల బాధతో 41 మంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడగా.. ఇందులో చింతలపూడి నియోజకవర్గంలోనే 31 కుటుంబాలు ఉన్నాయి. దీంతో చింతలపూడిలో శనివారం నాడు పవన్ కౌలురైతు భరోసా యాత్రను నిర్వహించాలని తలపెట్టారు.

Power Cut Effect: అనంతపురంలో పరిశ్రమలకు విద్యుత్ షాక్