Minister Nimmala Ramanayudu: కళలకు, కళాకారులకు పాలకొల్లు పుట్టినిల్లు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాలకొల్లుకు విశిష్ట స్థానం ఉందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిలిం ఇన్స్టిట్యూట్ యొక్క ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, పాలకొల్లు కళలకూ, కళాకారులకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమలో పాలకొల్లుకు ప్రత్యేక స్థానం ఉందని, రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌లో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం సానుకూలం అని చెప్పారు.
గతంలో ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రాంతాలు షూటింగ్‌లకు విహార కేంద్రాలుగా ఉపయోగించబడినప్పటికీ, ఇప్పుడు పాపులేషన్ పెరగడం మరియు పొల్యూషన్ కారణంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు మంత్రి రామానాయుడు.. “విశాఖపట్నం నుంచి గోదావరి జిల్లాకు కోనసీమ సహజ అందాలతో ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో పాలకొల్లులో ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం, కొంతమందిని కళాకారులుగా తయారు చేయడానికి కృషి చేయడం సంతోషకరం” అన్నారు.. ప్రారంభోత్సవంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కృషి, కళాకారుల శిక్షణ, భవిష్యత్తులో రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమకు మంచి మద్దతు కల్పిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చలనచిత్ర పరిశ్రమలో పాలకొల్లుకు విశిష్ట స్థానం ఉందని అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిలిం ఇన్ స్టిట్యూట్ ప్రారంభోత్సవంలో పేర్కొన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు..