NTV Telugu Site icon

Minister Nimmala Ramanaidu: జూన్ నాటికల్లా లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు..

Nimmala

Nimmala

Minister Nimmala Ramanaidu: వచ్చే జూన్ నాటికల్లా మిగిలిన టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందరికీ అప్పగించేలా పనులు జరుగుతున్నాయన్నారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎన్టీఆర్ టిడ్కో గృహాల సముదాయ కాలనీ ప్రాంతంలో, నర్సాపురం ప్రధాన కాలువపై రూ. రెండు కోట్లతో వంతెన నిర్మాణానికి మంత్రులు సత్య కుమార్ యాదవ్, రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. వచ్చే జూన్ నాటికల్లా మిగిలిన టిడ్కో గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందరికీ అప్పగించేలా పనిచేస్తున్నాం అన్నారు..

Read Also: Bharat Ane Nenu: మహేష్ బాబు ఫ్యాన్స్‌తోనే కామెడీనా?.. ఫైట్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో!

గత టీడీపీ ప్రభుత్వంలో 90 శాతం పూర్తి చేసిన ఇళ్లను వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో ధ్వంసమయ్యాయని ఆరోపించారు నిమ్మల రామానాయుడు.. టీడీపీ ప్రభుత్వంలో పూర్తయిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం బ్యాంకులో తాకట్టు పెట్టి, 5 వేల కోట్లను దారిమళ్లించి లబ్ధిదారుల నెత్తిన అప్పు భారం మోపారని జగన్‌పై ఫైర్‌ అయ్యారు.. 2019 ఎన్నికల్లో టిడ్కో గృహాలను ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేసి లబ్ధిదారులను దగా, మోసం చేసిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని దుయ్యబట్టారు.. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో అర్ధ రూపాయి పని, అరబస్త సిమెంట్ పని నోచుకోకపోగా విధ్వంసానికి గురయ్యాయని సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, చంద్రబాబు లబ్ధిదారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో, లబ్ధిదారుల బ్యాంకు రుణాలకు సంబంధించి రూ.140 కోట్లు మంజూరు చేశారని వివరించారు మంత్రి నిమ్మల రామానాయుడు..

Read Also: OnePlus 13 Mini: 6000mAh బ్యాటరీతో OnePlus 13 మినీ స్మార్ట్‌ఫోన్.. త్వరలో లాంచ్