West Godavari Crime: ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నారు.. కానీ, పెద్దలు అంగీకరించకపోవడంతో.. కలిసి ఎలాగూ బతకలేం.. కనీసం కలిసి చనిపోదాం అనుకున్నారు.. అందులో భాగంగా.. రైలు కిందపడి ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు.. పట్టాలపైకి ఎక్కారు.. తీరా రైలు వచ్చే సమయానికి ఓ ప్రేమికుడు.. తన ప్రియురాలు బతకాలని అనుకున్నాడు.. దీంతో.. ప్రియురాలిని రైలు పట్టాల పై నుంచి కిందకి తోసేసి.. తాను మాత్రం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు..
Read Also: Anand Bose: హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ భేటీ.. రాష్ట్రపతి పాలనపై ఊహాగానాలు!
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల వద్ద యువకుడు మృతి చెంది పడి ఉన్నాడని, పక్కనే మరోయువతి రక్త మడుగులో కూర్చుని విలపిస్తూ ఉండడం గమనించిన స్థానికులు.. 108కి సమాచారం అధించారు. యువతి తీవ్రమైన గాయాలు అవ్వడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భీమవరం రైల్వే ఎస్సై టీవీ రమణ తెలిపిన వివరాల ప్రకారం.. గణపవరంకు చెందిన రాజేష్, ఏస్. కొండేపాడు గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు.. వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోక పోవడంతో నిన్న రాత్రి భీమవరం నుండి బండిపై పాలకొల్లు చేరుకున్నారు.. ఆత్మహత్య చేసుకుందామని పట్టాలపైకి వెళ్లారు.. ఇంతలో ట్రైన్ దగ్గరకు రాగానే ప్రియురాలిని పక్కకి నెట్టిన రాజేష్.. తాను మాత్రం రైలు కింద పడిపోయాడు. యువతికి సృహ వచ్చి లేచి చూసేసరికి రాజేష్ ప్రాణాలు కోల్పోయాడని ఎస్ఐకి తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పూర్తిస్థాయిలో వివరాలు సేకరించే పనిలో పడిపోయారు.
