Karthika Masam 2025: కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమండ్రిలోని స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి నదిలో భక్తులు వేలాదిగా తరలి వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రాజమండ్రి చుట్టూ ప్రక్కల నుండి భారీగా భక్తులు పుష్కరఘాట్ కు తరలి వస్తున్నారు. స్నానాలు ఆచరించి పూజా కార్యక్రమాలు అనంతరం గోదావరి లో కార్తీక దీపాలు వదులుతున్నారు. రాజమండ్రి కోటి లింగాల ఘాట్ , మార్కండేయ ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమీ ఘాట్ లతోపాటు కొవ్వూరు గోష్పాదక్షేత్రంలోనూ భక్తులు కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు. చలికి వణుకుతూ శివ శివ అంటూ. గోదావరి నదిలో మూడు మునుగులు మునుగుతున్నారు. భక్తులు శివనామ స్మరణతో స్నాన ఘట్టాలు మార్మోగుతున్నాయి.. గోదావరి తీరంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శివలింగాలకు ప్రత్యేక అభిషేకాలు, పాలాభిషేకాలు. నిర్వహిస్తున్నారు.
Read Also: Mohan Bhagwat: పాకిస్థాన్‌కు నష్టం కలిగేలా భారత్ ఓడించాలి..
తూర్పు గోదావరి జిల్లాలో కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో భక్తులు గోదావరి స్నానాలు ఆచరిస్తున్నారు.. గోష్పాద క్షేత్రంలోని సుందరేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు.. భక్తులు కార్తీక దీపాలను గోదావరిలో వదిలి స్వామిని దర్శించుకుంటున్నారు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం మండలం ద్రాక్షారమ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమోగుతుంది.. కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో శ్రీ మాణిక్యం సమేత భీమేశ్వర స్వామివారిని తెల్లవారుజామున ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు . స్వామివారిని పెద్ద సంఖ్యలో వచ్చి భక్తులు దర్శించుకుంఉటన్నారు.. ఉదయం నుండి సప్త గోదావరిలో స్నానాలు ఆచరించి , దీపాలను గోదావరిలో వదిలి స్వామివారి దర్శించుకుంటున్నారు భక్తులు .
