NTV Telugu Site icon

పోలీసులపై తిరగబడ్డ పేకాటరాయుళ్లు..

పోలీసులపై పేకాటరాయుళ్లు దాడి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. భీమడోలు మండలం గుండుగొలనులో నిన్న అర్థరాత్రి పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం మేరకు పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే పోలీసులు దాడులు నిర్వహించడంతో పేకాటరాయుళ్లు తిరుగబడి పోలీసులపైనే దాడులు చేశారు. ఈ దాడిలో పోలీసులు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసుల నమోదు చేసుకున్నా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడిచేసిన నిందితులు ఏలూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. నిందితులు పరారీలో ఉన్నట్లు, వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.