Ram Mohan Naidu: ఏపీలో విమానాశ్రయాల అభివృద్ధిపై కేంద్రమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఏపీలో ప్రస్తుతం ఉన్న 7 విమానాశ్రయాలను 14కు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే, పుట్టపర్తిలో ఉన్న ప్రైవేట్ ఎయుర్ పోర్ట్ ను కూడా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నాం.. 500 నుంచి 700 ఎకరాలు ఉంటేనే చిన్న ఎయర్ పోర్ట్ లు అభివృద్ధి చేయవచ్చు.. పెద్ద ఎయిర్ పోర్ట్ లు నిర్మించాలంటే, కనీసం 3 వేల ఎకరాలకు పైగా భూమి కావాలి అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Read Also: Rajasthan: విద్యార్థుల మధ్య గొడవ, కత్తి పోట్లు.. ఉదయ్‌పూర్‌లో మతహింస..
ఇక, పెద్ద ఎత్తున కోస్తా తీరం అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంది అని కేంద్ర పౌర విమానయన మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ సీఎం సూచించారు. హెలికాప్టర్ల వినియోగంను పెద్ద ఎత్తున పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నాం.. ఏపీలో డ్రోన్ల వ్యవస్థను కూడా బాగా అభివృద్ధి చేయాలని నిర్ణయుంచాం.. డ్రోన్లకు సంబంధించి ఒక పెద్ద కార్యక్రమాన్ని అతి త్వరలో ఏపీలో నిర్వహిస్తాం.. ప్రస్తుతం ఏపీలో అభివృద్ది జరుగుతున్న ఎయిర్ పోర్ట్ ల నిర్మాణ పనులను నిర్దిష్ట సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.. నాగార్జున సాగర్, కుప్పం, దిగదుర్తి (ఒంగోలు), తుని-అన్నవరం, తాడేపల్లిగూడెంలో కొత్త ఎయిర్ పోర్ట్ ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. అలాగే “ఎయుర్ పోర్ట్ అధారిటీ” కి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయుస్తే తొందరలోనే ఎయిర్ పోర్టు నిర్మించే బాధ్యత తీసుకుంటుంది అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
