NTV Telugu Site icon

సీఎం జగన్ పై మేము చాలా నమ్మకంతో ఉన్నాం : బండి శ్రీనివాస రావు

AP JAC Charmin Bandi Srinivasa rao

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్‌సీ ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాలతో విడివిడిగా చర్చలు కొనసాగిస్తున్నారు. ముందుగా ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాలతో సమావేశమైన సజ్జల, తరువాత ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాస రావు మాట్లాడుతూ..11వ పీఆర్సీ అంశాలు సహా 70 డిమాండ్లు అమలు పై సజ్జలతో చర్చించామని, మా డిమాండ్లను సీఎం వద్దకు తీసుకెళ్లతామన్నారని ఆయన వెల్లడించారు. సీఎం జగన్ పై మేము చాలా నమ్మకంతో ఉన్నామని, సీఎస్ ఇచ్చిన ప్రతిపాదనలు మాకు మేలు చేసే పీఆర్సీ కాదన్నారు.

సీఎస్ కమిటీ సిఫార్సులు ప్రభుత్వానికి మేలి చేసేదే కాని, ఉద్యోగులకు మేలు చేసేది కాదని చెప్పామన్నారు. ప్రతిపాదనలు అమలు చేస్తే ఉద్యోగుల ఉనికికే ప్రశ్నార్థకం అవుతుందని, ఉద్యోగులకు 55 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని సజ్జలను కోరామన్నారు. హామీలు అమలయ్యే వరకు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశామన్నారు. – అశుతోష్ మిశ్రా పీఆర్సీ నివేదికను యథాతథంగా అమలు చేయాలని కోరామని, సీఎం మా డిమాండ్లకు సానుకూలంగా ఉన్నారని భావిస్తున్నామన్నారు. అంతేకాకుండా నిరాశ నిస్పృహలోకి వెళ్లిన ఉద్యోగులకు సంతోషం కల్గించే వార్త సీఎం చెబుతారని ఆశిస్తున్నామని, మాకు 14.29శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని సీఎస్ కమిటీ చెప్పడం సరైంది కాదన్నారు. 1-7-2018 నుంచి 55శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలన్నదే మా డిమాండ్ అని, ఎంత ఫిట్ మెంట్ ఇస్తారనేది సీఎం ఇష్టమన్నారు.