Srikanth Reddy: వైఎస్ వివేకా హత్యపై అసెంబ్లీలో చర్చకు రెడీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కూడా అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నమని ప్రకటించారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి.. అసెంబ్లీ సమావేశాల పై స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు అన్ని శాఖల అధికారులుతో సమీక్ష నిర్వహించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి.. అసెంబ్లీలో ప్రజాసమస్యలను అత్యంత ప్రధాన్యంగా సమావేశాలు నిర్వహిస్తాం అన్నారు.. ప్రజా సమస్యలపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్న ఆయన.. గతంలో టీడీపీలా కాకుండా మేం ప్రతిపక్షాన్ని గౌరవిస్తున్నాం అన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల పేరు తెచ్చి సమావేశాల నుండి వెళ్లిపోయారని విమర్శించిన ఆయన… ఇప్పుడు టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి హాజరుకావాలని సూచించారు.
Read also: Nadendla Manohar: వ్యక్తిగతంగా నష్టపోయినా పవన్ కల్యాణ్ పోరాటం..!
Also Read
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
- CM Chandrababu: తెలంగాణలో ఆస్తులన్నీ తెలుగు వారే అనుభవిస్తున్నారు.. ఎప్పుడూ రెగ్రేట్ ఫీల్ అవ్వలేదు!
- Kakinada Theft: కాకినాడలో విచిత్ర దొంగతనం.. క్షమాపణ లేఖ రాసి బంగారం తిరిగిచ్చిన యువకులు.. చివరకు!
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండి రాజకీయం చేయాలని అనుకుంటున్నారంటూ టీడీపీ సభ్యులపై మండిపడ్డారు శ్రీకాంత్‌రెడ్డి.. టీడీపీ బయట మాట్లాడేవి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలన్నా ఆయన.. ఇక, వైఎస్ వివేకా హత్య పై తప్పుడు రాతలు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. దానిపై కూడా అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అసెంబ్లీ అధికారులపై సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన లేఖ రాశారని.. దీనిపై బీఏసీలో చర్చించాలని కోరతాం అన్నారు.. అసెంబ్లీకి ఉన్న హక్కులపై కూడా చర్చించాలని భావిస్తున్నట్టు తెలిపారు శ్రీకాంత్‌రెడ్డి.
తాజావార్తలు
-
Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
-
FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
-
Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!