Site icon NTV Telugu

Srisailam EO: భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా నాణ్యమైన ప్రసాదం తయారీ

Srisailam

Srisailam

Srisailam EO: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో లడ్డూ తయారీకి గత 20 ఏళ్లుగా కర్నూలు విజయ డైరీ నెయ్యి వాడుతున్నామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. విజయ నెయ్యి 2022- 23లో 590 రూపాయలకి పెంచడంతో కమిషనర్ నిర్ణయంతో ఒక సంవత్సరం టెండర్ పిలిచాం అన్నారు. 2022- 23లో టెండర్ పిలవడంతో సంఘం డైరీ, రాజేష్ కార్పొరేషన్ రెండు టెండర్లు పాల్గొన్నాయి.. రాజేష్ కార్పొరేషన్ కేజీ నెయ్యి 485 రూపాయలకు అందిస్తామని చెప్పడంతో సంవత్సరం టెండర్ ఇచ్చాం అని ఈవో పేర్కొన్నారు. ఇక, నేటి వీడియో కాన్ఫరెన్స్ లో దేవాలయాలలో ప్రసాదాల నాణ్యతాపరమైన ప్రమాణాలు పాటించాలని చెప్పారు అని ఈవో పెద్దిరాజు వెల్లడించారు.

Read Also: Sajjala: తిరుమల లడ్డూ వివాదంపై సజ్జల రియాక్షన్..

అలాగే, భక్తుల మనోభావాలు దెబ్బ తీయకుండా పవిత్రమైన భావంతో స్వచ్ఛమైన ప్రసాదాలు అందించాలని చెప్పారు అని ఈవో పెద్దిరాజు తెలిపారు. దేవాలయాలలో తయారు చేసే ప్రసాదాలను మంచి ప్రమాణాలు పాటించాలని కమిషనర్ సూచనలు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రసాదాల నాణ్యత తయారీకి మంచి వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా భక్తులకు ప్రసాదాలు విక్రయాల కేంద్రాల జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం అని పెద్దిరాజు పేర్కొన్నారు.

Exit mobile version