NTV Telugu Site icon

Watchman attack on Constables: డయల్‌ 100కి కాల్‌.. పోలీసులు రాగానే దాడి..!

Attack

Attack

Watchman attack on Constables: ఎవరైనా సమస్య ఉంటే డయల్‌ 100కి కాల్‌ చేస్తారు.. పోలీసులు రాగానే వారికి సమాచారం చెప్పి.. సమస్య ఇది అని వారి దృష్టికి తీసుకెళ్లారు.. ఎవరు రాకపోయినా.. డయల్‌ 100కి కాల్‌ చేస్తే వెంటనే పోలీసులు వస్తారనే నమ్మకం ప్రజల్లోకి కలిగింది.. కాల్‌ రీసీవ్‌ చేసుకున్న కొన్ని నిమిషాల్లోనే ఘటనా స్థలంలో వాలిపోతున్నారు పోలీసులు.. తక్షణ సాయం అందిస్తున్నారు.. కానీ, విశాఖపట్నంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు డయల్‌ 100 కాల్‌ రిసీవ్‌ చేసుకుని.. వెళ్లే పోలీసులు టెన్షన్‌ పడేలా చేస్తోంది..

Read Also: Layoffs at Citigroup: మొన్ననే విలీనం పూర్తి.. ఇప్పుడు భారీగా ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం

విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అర్ధరాత్రి 12 గంటలకి ఒక అపార్ట్‌మెంట్‌ నుంచి డయల్‌ 100 కి కాల్ వచ్చింది.. దీంతో, హుటాహుటిన కాల్ చేసిన ప్రాంతానికి చేరుకున్నారు ఇద్దరు కానిస్టేబుళ్లు.. అయితే, 100కి కాల్ చేసింది ఫుల్‌గా మద్యం సేవించిన ఉన్న ఆ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌గా గుర్తించారు.. సదరు వాచ్‌మన్‌ని కాల్ సమాచారం కోసం వివరాలు అడిగారు కానిస్టేబుళ్లు లక్ష్మణరావు, కిషోర్‌.. కానీ, మద్యం మత్తులో ఉన్న వాచ్‌మన్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.. మాటామాట పెరగడంతో.. పోలీసులను వెంబడించాడు.. తన దగ్గర ఉన్న ఐరన్ రాడ్‌తో పోలీసులను ఉరికించాడు.. వారి తలపై రాడ్డుతో దాడి చేసినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఆ వాచ్‌మన్‌ బారినుంచి తప్పించుకున్న పోలీసులు.. తలపై తీవ్రగాయాలు అవడంతో సెవెన్ హిల్స్ హాస్పిటల్‌లో చేరారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు..