Site icon NTV Telugu

అనంతపురంలో స్వచ్ఛందంగా 4 థియేటర్లు మూసివేత…

Theatres

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్లపై…రెవెన్యూ అధికారుల దాడులు కొనసాగుతున్నాయ్. చిత్తూరు పలు థియేటర్లకు…అధికారులు నోటీసులు జారీ చేశారు. మరికొన్నింటికి మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అనంతపురం జిల్లా నాలుగు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు.

ఏపీలో నిబంధనలు పాటించని థియేటర్లపై అధికారులు కొరడా ఝులిపించారు. చిత్తూరు జిల్లాలో 11 థియేటర్లను సీజ్ చేశారు. మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని 37 సినిమా హాళ్లకు నోటీసులు ఇచ్చారు. వీటిలో 16 సినిమా థియేటర్లు మూసివేశారు. మదనపల్లిలో ఏడు, కుప్పంలో నాలుగు సినిమా థియేటర్ల మూసివేయాలని ఆదేశించారు.

అనంతపురం జిల్లా పలు చోట్ల సినిమా థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేస్తున్నాయ్ యాజమాన్యాలు. పెనుకొండలో మూడు థియేటర్లు, గోరంట్లలో ఓ థియేటర్ ను స్వచ్ఛందంగా మూసివేశారు ఓనర్లు.

అనంతపురం నగరంలో సినిమా హాళ్లను జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తినుబండారాలు, టిక్కెట్ విక్రయాలు చేయాలని సూచించారు. థియేటర్లలోనే ప్రేక్షకుల అవసరాల నిమిత్తం అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అని ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. ధరల బోర్డులను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని థియేటర్ నిర్వాహకులను హెచ్చరించారు.

Exit mobile version