TDP vs YCP: విజయనగరం జిల్లాలోని గుర్ల మండలం జమ్ము గ్రామంలో దేవి విగ్రహ నిమజ్జన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. వైసీపీ, టీడీపీ వర్గాలు గ్రామంలో వేర్వేరుగా అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేశారు. నవరాత్రులు ముగియడంతో ఇరు పార్టీలు నిమర్జన కార్యక్రమాన్ని చేపట్టాయి.. టీడీపీ వర్గీయులు ముందుగా అమ్మవారి విగ్రహాన్ని ఊరు దాటించారు. అయితే, వెనుక వస్తున్న వైసీపీ వర్గీయుల విగ్రహాన్ని చూసి రిథిగి ఓ వీధిలోకి మళ్లించారు. రెండు విగ్రహాలు ఎదురెదురు కావడంతో కాస్త ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య నెలకొన్ని వివాదం కాస్తా సమసిపోతున్న సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.. లాఠీచార్జ్‌కు దిగారు. పోలీసులు వైసీపీ వర్గీయులపై దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మహిళలపై కూడా పోలీసులు లాఠీచార్జ్ కు పాల్పడ్డారని గ్రామస్తులు మండిపడుతున్నారు.. ఇది హేయమైన చర్య అని ఫైర్ అవుతున్నారు..
Read Also: AP Fake Liquor Case: కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలకు బిగ్‌షాక్…
అయితే, ఈ ఘర్షణలో కనీసం 10 మందికి గాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా చెబుతున్నారు.. బాధితులను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆనంద్ అనే యువకుడిని పోలీసులు చుట్టుముట్టి విచక్షణారహితంగా చితకబాదారని చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు వ్యవహారించిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు వైసీపీ కార్యకర్తలు.. ముఖ్యంగా సంబంధిత సీఐ అత్యుత్సాహం చూపించి, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని స్థానిక నేతలు మండిపడుతున్నారు.
