విజయనగరంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్ సీపీకి మజ్జి శ్రీనివాసరావు రాజీనామా చేశారు. మజ్జి శ్రీనివాసరావు బొత్స సత్యనారాయణ మేనల్లుడు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్‌కు పంపించారు. భీమిలి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పదవికి కూడా రాజీనామా చేశారు. అలాగే వైఎస్సార్ సీపీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
తనకు వివిధ హోదాలు, పదవులు కల్పించిన వైఎస్ జగన్‌కు మజ్జి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. తనను అన్ని విధాలా ప్రోత్సహించిన జగన్‌కు ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. కొన్నాళ్లుగా బొత్స, చిన్న శ్రీను మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.

