NTV Telugu Site icon

MLC Election: విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల..

Vizianagaram

Vizianagaram

MLC Election: విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నగారా మోగింది. ఈ నెల 28న ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇందుకూరి రఘురాజు ఎన్నికయ్యారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన పార్టీ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడ్డారని, టీడీపీ నాయకులతో కలిసి వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యారని, ఆయన్ని శాసనమండలి సభ్యుడికి అనర్హుడిగా ప్రకటిస్తూ చర్యలు తీసుకోవాలని.. మండలిలో ఆ పార్టీ విప్ పాలవలస విక్రాంత్ చైర్మన్ కు గతంలో ఫిర్యాదు చేశారు.

Read Also: Karthika Masam 2024: నేటి నుంచి కార్తీక మాసం.. శివాలయాలకు పోటెత్తిన భక్తజనం..

ఇక, దీనిపై రఘురాజు వివరణ తీసుకున్నా.. ఆదారిత వివరణ ఇవ్వకపోవడంతో చైర్మన్ అనర్హత వేటు వేశారు. దీంతో, జూన్ 3వ తేదీ నుంచి ఈ స్థానం ఖాళీ అయింది. 2027 డిసెంబర్‌ ఒకటి వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ రఘురాజును అనర్హుడిగా ప్రకటించడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తొలిత ఈ స్థానానికి నోటిఫికేషన్ ఇవ్వొదన్న ఎన్నిక సంఘానికి న్యాయస్థానం సూచన చేసింది. ఇక, ఇంత వరకు వేచి చూసిన ఎన్నిక సంఘం.. శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ తో నెల రోజుల పాటు జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. శుక్రవారం నుంచే జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఢిల్లీలో విడుదల చేసిన పకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జిల్లా పర్యటన కూడా వాయిదా పడిన విషయం విదితమే..

Show comments