Site icon NTV Telugu

Travels Bus Caught Fire: మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. పూర్తిగా దగ్ధం..

Travels Bus Caught Fire

Travels Bus Caught Fire

Travels Bus Caught Fire: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో ప్రమాదాలు ఆగడం లేదు.. విజయనగరం జిల్లా రామభద్రపురం, సాలూరు మధ్య రహదారిపై తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్ నుంచి జైపూర్ వెళ్తున్న ఆరంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. డ్రైవర్ దశరథ్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును వెంటనే ఆపడంతో ప్రయాణికులు అందరూ సురక్షితంగా దిగిపోయారు. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ, ఎవరికి గాయాలు కాలేదు. ఈ బస్సులో ఒడిశాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: Iranian oil: ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా.. ఏప్రిల్ 19 వరకు అమలు..

Exit mobile version