ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి నెలకొంది. రేపు 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం నుంచి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో 72 పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు చేశారు. విజయనగరం డివిజన్‌లో అత్యధికంగా 33,643 ఓటర్లు వుండగా, చీపురుపల్లిలో 14,256 మంది, బొబ్బిలిలో 10,603 మంది ఓటర్లు వున్నారు. జిల్లాలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం 72 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. విజయనగరం డివిజన్‌లో 42, బొబ్బిలిలో 13, చీపురుపల్లిలో 17 చొప్పున పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు.
Aslo Read:MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు.. ఈసీకి చంద్రబాబు లేఖ
ఒక్క విజయనగరం పట్టణంలోనే 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం అవసరమైన సామాగ్రిని పంపిణీ చేసేందుకు ఎన్నికల సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు మూడు డివిజన్ కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు.విజయనగరం డివిజన్‌కు ఆర్.డి.ఓ. కార్యాలయంలోనూ, చీపురుపల్లికి సంబంధించి ఎస్.డి.ఎస్.కళాశాల, గరివిడిలోనూ, బొబ్బిలి తహశీల్దార్ కార్యాలయంలోనూ ఎన్నికల సామాగ్రి పంపిణీకి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఎన్నికల సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు 15 ఆర్టీసీ బస్సులు సిద్ధం చేశారు. 72 పోలింగ్ కేంద్రాలకు 72 మంది పి.ఓ.లతో పాటు రిజర్వులో మరో 18 మందిని పి.ఓ., 144 మంది ఓపిఓలు, మరో 41 మంది రిజర్వు సిబ్బందిని నియమించారు. జిల్లాను 13 జోన్లుగా విభజించి 13 మంది జోనల్ అధికారులను నియమికం చేశారు. 13 రూట్లుగా విభజించి 24 మంది రూట్ అధికారులను నియమించారు.