Site icon NTV Telugu

DJ Sound System: యువకుడి ప్రాణం తీసిన డీజే సౌండ్‌.. డ్యాన్స్‌ చేస్తుండగా ఆగిన గుండె..

Dj Sound

Dj Sound

DJ Sound System: ఏ ఫంక్షన్‌ జరిగిన సౌండ్‌ మోగాల్సిందే.. పెళ్లి అయినా.. రిసెప్షన్‌ అయినా.. ఇంకా ఏ చిన్న ఫంక్షన్‌ అయినా.. చివరకు వినాయకుడి దగ్గర కూడా డీజే సౌండ్స్‌ ఉండాల్సిందే అన్నట్టుగా తయారైంది పరిస్థితి.. అయితే, ఆ డీజే సౌండ్స్‌ ఇప్పుడు ప్రాణాలు తీస్తున్నాయి.. ఇప్పటికే ఎంతోమంది డీజే సౌండ్స్‌ దెబ్బకు కుప్పకూలిపోయారు. తాజాగా, విజయనగరంలో బొబ్బాదిపేటకు చెందిన బొబ్బాది హరీష్ (22) డీజే సౌండ్స్ కారణంగా మృతి చెందాడు.

Read Also: Hyderabad: డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ 8 మంది ట్రాన్స్‌జెండర్లు.. ఈ యాప్‌ ద్వారా కొనుగోళ్లు..!

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లే.. బుధవారం రాత్రి వినాయక ఊరేగింపు సందర్భంగా డీజే సౌండ్స్‌కు హరీష్ డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. డిగ్రీ పూర్తి చేసిన హరీష్ పోటీ పరీక్షలకు కోచింగ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లేందుకు రిజర్వేషన్ చేయించుకున్నాడు. అప్పటి వరకు ఉత్సాహంగా గడిపిన హరీష్.. ఇక లేడన్న సమాచారంతో బొబ్బాదిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. డీజే సౌండ్స్ ను నిషేధించకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని డీజే సౌండ్స్ ను నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు.

Exit mobile version