Site icon NTV Telugu

Boy Swallowed Five Rupee Coin: రూ.5 బిల్ల మింగిన బాలుడు.. అన్నవాహికలో ఇరుక్కుపోవడంతో..

Five Rupee Coin

Five Rupee Coin

Boy Swallowed Five Rupee Coin: చిన్న పిల్లలు ఆడుకుంటూ.. ఏది దొరికితే అది నోట్లు పెట్టుకుంటారు.. కాస్త పెద్దగైన తర్వాత కూడా పిల్లలు నోట్లో ఏదో ఒకటి పెట్టుకొని ఆడుకోవడం చూశాం.. అయితే, అదే కొన్ని సార్లు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుంది.. కొందరు చిన్న చిన్న వస్తువులు.. పావలా, అర్ధరూపాయి, రూపాయి నాణెలు కూడా మింగిన సందర్భాలు ఉన్నాయి.. కొన్ని సార్లు వాటితో తీవ్రంగా ఇబ్బందిపడిన ఘటనలు లేకపోలేదు.. తాజాగా, విజయనగరం జిల్లా రేగిడి మండలం కోడిశ గ్రామానికి చెందిన ఏడు సంవత్సరాల బాలుడు పూర్ణ తేజేశ్వరరావు ఇంటి దగ్గర ఆడుకుంటూ 5 రూపాయల నాణెం మింగేసాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో విలవిల్లాడాడు. తీవ్రంగా ఏడుస్తూ బాలుడు అస్వస్థతకు గురవ్వటంతో.. తల్లిదండ్రులు హుటాహుటిన రాజాం పట్టణంలోని ఆరోగ్య హాస్పిటల్‌కి తరలించారు. డాక్టర్ వెంటనే బాలుడికి ఎక్సరే తీయించి.. అన్నవాహికలో నాణెం ఉన్నట్లు గుర్తించారు. ఎండోస్కోపి విధానం ద్వారా బాలుడు అన్నవాహికలో ఇరుక్కున్న 5 నాణెన్ని జాగ్రత్తగా బయటకు తీశారు వైద్యులు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. చిన్నారులు మింగేసే పరిమాణంలోని వస్తువులను వారికి అందుబాటులో ఉంచొద్దని డాక్టర్ రఘు సూచించారు.

Read Also: Sanjana Ganesan: నా కొడుకుతో మీకేంట్రా పని.. ఇచ్చి పడేసిన బుమ్రా వైఫ్!

Exit mobile version