విశాఖలో ఓ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ వార్తల్లోకి ఎక్కింది. ప్రేమించిన యువతి కోసం ఇద్దరు యువకులు ఘర్షణకు దిగారు. ప్రేమ, ప్రేయసి కోసం చాకుతో దాడికి పాల్పడి హత్యాయత్నం చేశాడు ఓ యువకుడు. విశాఖ 3 టౌన్ పోలీస్ పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బోగాపురానికి చెందిన సూర్య, చైతన్య ఇద్దరు కాలేజ్ మెట్స్. వీరిద్దరి మధ్య రెండున్నరేళ్లగా ప్రేమ వ్యవహారం నడిచింది.
5 ఏళ్ళ కిందట ఫ్రీ ఫైర్ గేమ్ లో చెన్నై కడలూరుకి చెందిన కార్తికేయకు సూర్యతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహం, ప్రేమగా మారింది. ఈ క్రమంలో చైతన్యను దూరం పెట్టడంతో పగ పెంచుకొన్నాడు. ఎలా ఆయినా ప్రేమ అడ్డు తొలగించుకోవాలని అనుకున్న చైతన్య.. కార్తికేయ, సూర్యను వైజాగ్ రప్పించి సర్క్యూట్ హౌస్ సమీపంలో చాకుతో దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు యువకులతో పాటు యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
