Vizag Police Arrest Part Time Job Fraudsters: మోసగాళ్లు ఈమధ్య నిరుద్యోగుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో వల వేసి, వారి వద్ద నుంచి భారీ సొమ్ము దోచేసుకుంటున్నారు. మంచి జీతం వస్తుందని ఊరించి, వారి జేబుల్ని కాజేస్తున్నారు. తాజాగా ఒక ముఠా కూడా ఇలాంటి మోసాలకే పాల్పడింది. ఆన్‌లైన్‌లో పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో బాధితుల నుంచి లక్షల రూపాయలు దోచేసింది. నకిలీ సర్టిఫికేట్‌లతో కంపెనీలు పెట్టి, సిమ్ కార్డుల్ని తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆధార్ కార్డ్ కోసం వచ్చే వ్యక్తుల వేలి ముద్రల ఆధారంగా.. సిమ్ కార్డులు తయారు చేస్తున్నట్టు తేలింది. రాజస్థాన్ బిల్వ జిల్లాకు చెందిన యువకులు ఈ ముఠాలో కీలకంగా ఉన్నారు. ఒక్క విశాఖపట్నంలోనే ఈ ముఠా చేతిలో 78 మంది 2.5 కోట్లు నష్టపోయారు. మోసపోయిన వారిలో ఎక్కువ శాతం గృహిణులు ఉన్నారు. ఈ కేసుని చేధించిన అనంతరం వైజాగ్ సీపీ శ్రీకాంత్ మీడియా ముందు వివరాలు వెల్లడించారు. పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో మోసగించే ముఠాలతో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పని చేయకుండా వేతనం ఇస్తామన్న వ్యక్తులకు ఆశ పడి మోసోవద్దన్నారు. రాజస్థాన్‌కు చెందిన ముఠాలపై విశాఖ పోలీసుల ప్రత్యేక నిఘా ఉందని, ఈ ముఠా దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతోందని తెలిపారు. విశాఖ సైబర్ క్రైమ్ పోలీసుల చొరవతో తాము ఈ ముఠాని గుర్తించి, పట్టుకున్నామని స్పష్టం చేశారు.
Extramarital Affair : వివాహేతర సంబంధం వదులుకోలేక ప్రియురాలి భర్తను చంపిన ప్రియుడు
వైజాగ్‌లో ఈ తరహా మోసాలు ఇప్పటికే చాలా జరిగాయి. గత నవంబర్ నెలలోనూ ఆన్‌లైన్‌లో ఉద్యోగం కోసం వెతుకుతుండగా.. ఒక లింక్ క్లిక్ చేసి, కొందరు డబ్బులు కోల్పోయారు. ఓ యువతికి పార్ట్ టైం జాబ్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఒక లింక్ రాగా.. అది నిజమేననుకొని ఆమె లింక్ క్లిక్ చేసింది. అది ఒక నంబర్‌ని చూపించగా.. ఆ నంబర్‌కు కాంటాక్ట్ చేసింది. అవతల మాట్లాడిన వ్యక్తి మరో లింక్ క్లిక్ చేయగా.. ఒక ఫేక్ పేజీ ఓపెన్ అయ్యింది. ఆ పేజీలో ఉన్న ప్రాసెస్ ప్రకారం వివరాలు జోడిస్తూ వెళ్లింది. చివరికి ఆమె ఖాతా నుంచి డబ్బులు మాయం అయ్యాయి. ఇలా ఎంతోమంది మోసపోయిన ఘటనలు వైజాగ్‌లో చోటు చేసుకున్నాయి.
