NTV Telugu Site icon

Vizag Cp Srikanth:విశాఖ ఘటనపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు

Vizag Cp (1)

Vizag Cp (1)

ఈనెల 15 వ తేదీన పవన కళ్యాణ్ విశాఖ పర్యటనలో జరిగిన సంఘటనపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయన్నారు విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్. పవన్ కళ్యాణ్ పర్యటన కు సంబంధించి జనసేన పి ఏ సి సభ్యులు సమాచారం ఇచ్చారు..ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పలేదు. కొందరు మంత్రులు 15 వ తేదీ సాయంత్రం విశాఖ లో గర్జన కార్యక్రమం ముగించుకొని ఎయిర్ పోర్టు కు వచ్చిన తరుణం లో వారిపై దాడి చేశారు. ఈ దాడి లో మంత్రి రోజా సహాయకులు దిలీప్ కుమార్ తోపాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న పెందుర్తి సీఐ గాయాలు అయ్యాయన్నారు.

ముందస్తు ప్రణాళికలు ప్రకారమే దాడి చేశారని భావించాలి. ఈ సంఘటనలో జనసేన నాయకులు పై కేసులు నమోదు చేసాం. పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసాం. ర్యాలీ వలన జాతీయ రహదారిపై నాలుగు గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యింది. 30 మంది ప్రయాణికులు విమానాలు అందుకోలేకపోయారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసాం. ర్యాలీ కి అనుమతి లేదు అంటూ నప్పజెప్పి డి సి పి పవన్ కళ్యాణ్ ను హోటల్ కు తీసుకువెళ్లారు. నగర ప్రజలు శాంతి భద్రతలు కాపాడటానికి సహకరించాలి.

Read Also: Yanamala Ramakrishnudu: తప్పులు, అప్పులు కప్పిపుచ్చుకునేందుకు జగన్ తంటాలు

ఈ సంఘటనకు సంబంధించి జనసేన నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఎయిర్ పోర్టు సంఘటన, విధులకు ఆటంకం కలిగించిన సంఘటనలో ఇప్పటివరకు 100 మందిని అరెస్టు చేసాము. మరికొంతమంది గుర్తిస్తున్నాం వారిని కూడా అరెస్టు చేస్తాం అని వివరణ ఇచ్చారు విశాఖ సీపీ శ్రీకాంత్. విశాఖ ఎయిర్ పోర్టులో దాడి ఘటనలో మొత్తం 70 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా…వారిలో 61 మందికి బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసులో మిగిలిన 9 మందికి స్థానిక కోర్టు రిమాండ్ విధించగా… వారంతా విశాఖ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. తమకు బెయిల్ ఇవ్వాలన్న నిందితుల పిటిషన్లను విశాఖ కోర్టు కొట్టివేసింది. అనంతరం వారంతా హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం వీరి పిటిషన్లపై విచారణ చేపట్టింది ఏపీ హైకోర్టు.. మొత్తం 9 మందికి బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత శనివారం 9 మంది జనసేన నేతలను విశాఖ జైలు అధికారులు విడుదల చేశారు. దీంతో జనసేన నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Read Also: India vs Pakistan: దీపావళి ధమాకా.. విరాట్ విశ్వరూపం.. పాక్‌పై భారత్ విజయం