విశాఖలోని బ్రాండిక్స్ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్థన్ రెడ్డి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లోని బ్రాండిక్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఆయన విచారణ వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపి , దోషులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజీపీ డిమాండ్ చేస్తోందన్నారు.
విశాఖపట్నంలో అత్యంత విషాదంగా ఘటన ఎల్జీ పాలిమర్స్ తరవాత కూడా పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. అస్వస్థతకు గురైనవారికి మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని బీజేపీ కోరుతోందన్నారు. రసాయనిక పరిశ్రమలపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేయకపోవడం వల్లనే తరుచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు విష్ణువర్థన్ రెడ్డి. ఈ సంఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ ప్రమాదంలో బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతూనే వుంది. ఇప్పటికే 300 మంది బాధితులు ఆస్పత్రుల్లో చేరారు. ఇద్దరు మహిళా ఉద్యోగినుల పరిస్థితి సీరియస్ గా వుంది.
Bandi Sanjay: కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ కోరాలి