Site icon NTV Telugu

చంద్రబాబు సారీ చెప్పాలని.. వైసీపీ నిరసన

అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల నిరసనలతో ఏపీ హీటెక్కింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పట్టాభి, నారా లోకేష్, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి ఇంచార్జ్ అనం రెడ్డి అజయ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అన్నిటికీ చంద్రబాబునాయుడే కారణమని, రాష్ట్రంలో మేమున్నామని,రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి దాడుల డ్రామా ఆడుతున్నారని అజయ్ అన్నారు.

బుధవారం సాయంత్రం పెందుర్తి కూడలి లో వైసీపీ శ్రేణులు భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు నాయుడు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసనలు హోరెత్తాయి. టీడీపీ నిరసనలకు కౌంటర్‌గా వైసీపీ నేతలు ఆందోళనలకు దిగారు.

Exit mobile version