Site icon NTV Telugu

Simhachalam Tragedy: ప్రమాద స్థలిని పరిశీలించిన బొత్స బృందం

Botsasatyanarayana

Botsasatyanarayana

విశాఖలోని సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ప్రమాద స్థలిని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బృందం పరిశీలించింది. బొత్స వెంట మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ప్రభుత్వం నియమించిన దర్యాప్తు కమిటీ బృందం కూడా సంఘటనాస్థలిని పరిశీలించింది. అధికారులు నుంచి వివరాలు రాబట్టింది.

ఇది కూడా చదవండి: Taapsee : ఇలాంటి ఓ రోజు వస్తుందని నాకు ముందే తెలుసు..

బుధవారం గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. అయితే గోడ ఇటీవలే నిర్మించారు. అయితే గోడ విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. హడావుడిగా గోడ నిర్మించినట్లుగా తెలుస్తోంది. పిల్లర్లు లేకుండానే గోడ నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షానికి గోడ కూలిపోయినట్లుగా సమాచారం. ఆలయ అధికారుల నిర్లక్ష్యంగానే ఇదంతా జరిగినట్లుగా భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: శ్రామికులే లేకపోతే దేశ నిర్మాణం లేదు‌‌

ఇక మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25లక్షలు, పీఎం నిధి నుంచి రూ.2లక్షల సాయం ప్రకటించారు. అయితే రూ.కోటి నష్టపరిహారం ప్రకటించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. ఇక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు.

Exit mobile version