Site icon NTV Telugu

YS Jagan Road show: విశాఖలో వైఎస్‌ జగన్‌ రోడ్‌షో..

Ys Jagan

Ys Jagan

YS Jagan Road show: విశాఖపట్నంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రోడ్‌ షో కొనసాగుతోంది.. తాడేపల్లిలోని తన నివాసం నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయన. ఇక, విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి నర్సీపట్నం రోడ్డు మార్గాన బయల్దేరారు.. పోలీసులు షరతుల మధ్య జగన్ టూర్ పై ఉత్కంఠ కొనసాగుతుండగా.. పోలీసులు నిర్దేశించిన పెందుర్తి., అనకాపల్లి మీదుగా మెడికల్ కాలేజ్ దగ్గరకు చేరుకోనున్నారు జగన్‌.. ఇక, కాకాని నగర్ దగ్గర వైఎస్‌ జగన్‌ను కలిశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు.. ఈ సందర్బంగా తమ సమస్యలపై జగన్‌కు వినతి పత్రం అందజేశారు. స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని జగన్‌ భరోసా ఇచ్చారు.. 10 నిముషాలకు పైగా కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడారు జగన్‌.. స్టీల్ ప్లాంట్ పరిణామాలపై కార్మిక నేతల నుంచి సమాచారం తీసుకున్నారు మాజీ సీఎం..

Read Also: Minister Nara Lokesh: మనమంతా టీడీపీ కుటుంబ సభ్యులం.. ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం..

ఆ తర్వాత రోడ్ షోలో జగన్ ను కలిశారు న్యాయవాదులు.. తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు.. అండగా ఉంటానని లాయర్లకు హామీ ఇచ్చారు.. మరోవైపు, వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ బాధితులు.. నక్కపల్లి మండలానికి చెందిన 16 గ్రామాల మత్స్యకారులు రాగా.. జి.భీమవరం వద్ద పోలీసులు అడ్డుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.. జగన్‌ను కలిసేందుకు అనుమతి లేదని పోలీసుల అంటుండగా.. కలిసి తీరుతామని పట్టుబట్టారు మత్స్యకారులు. అయితే, వైఎస్‌ జగన్‌ రోడ్డు షోకు పెద్ద ఎత్తున తరలివచ్చారు వైసీపీ శ్రేణులు.. ఓవైపు పోలీసులు ఆంక్షలు ఉన్నా.. వాటిని లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో వచ్చి జగన్‌కు స్వాగతం పలుకుతున్నారు.. ఇక, వారికి అభివాదం చేస్తూరోడ్‌లో ముందుకు సాగుతున్నారు వైఎస్‌ జగన్‌..

Exit mobile version