IAS Officers Simple Marriage: పెళ్లంటే హంగు, ఆర్భాటాలు.. ఎవరిస్థాయిలో వారు నిర్వహిస్తారు.. మరి కొందరు అయితే.. మాట రావొద్దు అంటూ.. అప్పు చేసైనా గొప్పలకు పోయి పెళ్లిళ్లు చేసేవారు ఉన్నారు.. జీవితంలో ఒక్కసారే చేసుకునే ఈ తంతు.. కలకాలం గుర్తుండిపోవాలి అంటూ కోట్ల రూపాయలు ఖర్చు చేసేవారు లేకపోలేదు.. అయితే, పెళ్లంటే ఆర్భాటాలు కాదు.. ఒకరికి ఒకరు జీవితాంతం తోడు నీడగా నిలబడటమేనని నిరూపించింది ఓ యువ ఐఏఎస్ జంట.. ధూమ్ ధామ్ గా పెళ్లి చేసుకుని.. హంగామా.. ఆర్భాటం చేసే అవకాశం ఉన్న అధికారులు నిరాడంబరంగా ఒక్కటవ్వడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Read Also: Woman Cooking Train: రైలులో మ్యాగీ వండిన మహిళ.. వీడియో వైరల్..
విశాఖపట్నంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా జరిగిన యువ ఐఏఎస్ అధికారుల పెళ్లికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే… ఆంధ్ర క్యాడర్ కు చెందిన తిరుమణి శ్రీ పూజ, మేఘాలయ IAS ఆదిత్య వర్మల వివాహం విశాఖపట్నం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగింది. ఇద్దరూ ఉన్నతాధికారులు అయినప్పటికీ హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా వెళ్లి చేసుకోవడం అభినందాలకు కారణం అయ్యింది. ఆర్భాటాలు కాదు.. ప్రేమ, పరస్పర గౌరవం, ఆర్థిక భారం లేని.. నూతన జీవితమే అసలు శోభ అని నిరూపించారు. ఈ యువ ఐఏఎస్ అధికారులు.. ఇక, యువ ఐఏఎస్ ల వివాహ వేడుకకు రెండు కుటుంబాల సమక్షంలో ఆత్మీయుల హాజరయ్యారు. ప్రస్తుతం తిరుమణి శ్రీపూజ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, ఇంఛార్జ్ సంయుక్త కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. వరుడు ఆదిత్య వర్మ మేఘాలయలో దాదెంగ్రి జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ముందుగా విశాఖలోని కైలాసగిరిపై ఉన్న శివాలయంలో దండలు మార్చుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ యువ ఐఏఎస్ జంట.. ఆ తర్వాత.. వన్‌టౌన్‌లోని జాయింట్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సంతకాలు చేసి తమ వివాహాన్ని రిజిస్ట్రార్ చేసుకున్నారు..