NTV Telugu Site icon

Vizag Steel Plant: స్టీల్‌ ప్లాంట్‌ పోరాటం ఉధృతం.. నేటి నుంచి సత్యాగ్రహ దీక్షలు..

Vizag Steel Plant

Vizag Steel Plant

Vizag Steel Plant: మూడున్నర ఏళ్లుగా కార్మికుల చేతుల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ఇప్పుడు కీలక దశకు చేరింది. స్టీల్ ప్లాంట్ మనగడసాగించాలన్నా.. మూతపడాలన్న వచ్చే ఆరు నెలలు అత్యంత కీలకమైన సమయంగా ప్రజాసంఘాలు భావిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీల ద్వారా కేంద్రంపై పొలిటికల్ లాబీయింగ్ చేస్తూనే…. ఉద్యమ వేడిని మరింత విస్తరించాలని నిర్ణయించాయి. తాజాగా ఉక్కు పరిరక్షణ పోరాటంలోకి ఉత్తరాంధ్ర విద్యార్థి, మేథావి,ఉద్యోగ, ప్రజా సంఘాలు ఎంటర్ అవుతున్నాయి. ఆంధ్రుల హక్కుగా వచ్చిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడమే లక్ష్యంగా గాంధీ గిరికి సన్నద్ధమయ్యాయి. ఉక్కు సత్యాగ్రహ దీక్షపేరుతో ఎక్కడికక్కడ రిలే దీక్షలు ప్రారంభమవుతున్నాయి.

Read Also: Arasavilli temple: అరసవల్లి ఆలయంలో అద్భుత దృశ్యం.. ఆదిత్యుని పాదాలను తాకిన సూర్య కిరణాలు

ఉత్తరాంధ్ర ప్రజల భాగస్వామ్యంతో భారీ ర్యాలీని ప్రజా సంఘాల తలపెట్టాయి. గాంధీ జయంతి రోజున డాబా గార్డెన్స్ లోని బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి GVMC మహాత్మా గాంధీజీ విగ్రహం వరకు ఈ ప్రజా ప్రదర్శన జరుగుతుంది. ఇప్పటికే రాజకీయ పక్షాలు స్టీల్ ప్లాంట్ పై మల్లగుల్లాలు పడుతుండగా… పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల వైజాగ్ షెడ్యూల్ ఆసక్తికరంగా మారింది. విశాఖ ఉక్కు కోసం ప్రజా సంఘాలు చేస్తున్న ప్రదర్శనలకు మద్దతు ఇవ్వడంతో పాటు పరిరక్షణ పోరాట కమిటీకి కాంగ్రెస్ వెన్నుదన్నుగా ఉంటుందని నేతలు హామీ ఇస్తున్నారు. దీంతో ఉద్యమం మళ్లీ ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.