Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. స్టీల్ మెల్టింగ్ షాప్‌లో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం, మరికొందరు గాయపడడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై వెంటనే అధికారులతో మాట్లాడిన సీఎం, ప్రస్తుత పరిస్థితులు మరియు సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇదే ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్టీల్ మెల్టింగ్ షాప్-2లో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో లిక్విడ్ స్టీల్ కార్మికులపై పడిన కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, కుటుంబ పెద్దలను కోల్పోయిన వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని అన్నారు. ప్రమాద బాధితులు, వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవాలని పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించిన జగన్, గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
Also Read
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
మరోవైపు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆమె, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాద ఘటనపై విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్లతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. విజయనగరం పర్యటనలో ఉన్న హోంమంత్రి అనిత, ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన విశాఖపట్నానికి బయలుదేరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాద స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
అదేవిధంగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసిన ఆయన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదానికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని, ఉన్నత స్థాయి సేఫ్టీ కమిటీతో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు అమలు చేయాలని, ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీవీఎన్ మాధవ్ కోరారు. మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఈ విషాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు, వివిధ రాజకీయ నాయకులు స్పందిస్తూ బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే ఈ ఘటనలో 9 మంది మృతిచెందినట్టుగా ప్రకటించారు.. మరికొందరు కార్మికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఇంకా కొంతమంది ఆచూకీ తెలియాల్సి ఉంది.. దీంతో, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది..
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!