Vizag Honey Trap Case: హనీట్రాప్ కేసు.. కీలక ఆధారాలు స్వాధీనం
- విశాఖ హనీట్రాప్ కేసులో కీలక పరిణామాలు
- కస్టడీలోకి తీసుకున్న జెమిమా నుండి కీలక ఆధారాలు స్వాధీనం
- జెమిమాకు చెందిన మిగతా మొబైల్స్ కూడా స్వాధీనం
- అందులో కీలక వ్యక్తుల డేటా లభ్యం అయినట్లు సమాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ హనీట్రాప్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కస్టడీలోకి తీసుకున్న కిలాడీ జెమిమా నుండి కీలక ఆధారాలు స్వాధీనం పరుచుకున్నారు పోలీసులు. జెమిమాకు చెందిన మిగతా మొబైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక వ్యక్తుల డేటా లభ్యం అయినట్లు సమాచారం.. అయితే పోలీసులు మాత్రం వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. హనీ ట్రాప్ కేసులో కీలక వ్యక్తులు సమాచారం బయట పడకుండా జాగ్రత్త పడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. జెమీమాను 3 రోజులు కస్టడీ కోరి రెండు రోజులకే ముగించారు పోలీసులు. అంతేకాకుండా.. మీడియా వద్ద నోరు తెరవనీయకుండా పోలీసులు జాగ్రత్తలు పడ్డారు. కస్టడీ ముగిశాక వైద్య పరీక్షలు నిర్వహించకుండా పోలీస్ వెహికల్లో తిప్పిన వైనం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మీడియాను చూసి కేజీహెచ్ వద్ద నుండి జెమిమాను వెనక్కి తీసుకెళ్లిపోయారు కంచరపాలెం పోలీసులు. హనీ ట్రాప్ ముఠా సభ్యుల్లో డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
Read Also: Attack on Arvind Kejriwal: పాదయాత్రలో కేజ్రీవాల్‌పై దాడి.. బీజేపీ పనే?
Also Read
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
కాగా.. ఉదయం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు జెమీమాను విచారించారు. జెమీమా పరిచయాలపై ఆరా తీశారు. ఫారెస్ట్ అధికారితో కిలాడీ లేడీకి ఉన్న సంబంధాలపై విచారించారు. ఇక, హనీట్రాప్ ముఠా సభ్యుల కోసం ప్రత్యేక బృందాల గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఠా కీలక సభ్యుడు వేముల కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనీ ట్రాప్ కేసులో ఇప్పటికే విస్తుపోయే విషయాలు వెలుగు చూసిన విషయం విదితమే.. తనపై మత్తుమందు చల్లి.. ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను తీసిందని పోలీసులకు వరుసగా బాధితులు కంప్లైంట్ చేయడంతో.. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.. అందులో భాగంగా కిలాడీ లేడీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్న విషయం విదితమే.
Read Also: Vijayawada: ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో కొత్త ట్విస్ట్..
తాజావార్తలు
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
-
Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Toyota Hilux India Launch: కొత్త Toyota Hilux డిజైన్ రివీల్.. ధర, ఫీచర్లపై కీలక అప్డేట్
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!