Site icon NTV Telugu

Vizag Drug Case: విశాఖ డ్రగ్స్ కేసులో రాజకీయ ఒత్తిడి లేదు..

Vizag Cp

Vizag Cp

Vizag Drug Case: విశాఖ పట్నంలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. అయితే, అరెస్ట్ చేసిన వారిలో సౌతాఫ్రికాకు చెందిన థామస్‌ను వారం రోజుల పాటు, అక్షయ్ కుమార్ అలియాస్ మున్నా, డాక్టర్ కృష్ణ చైతన్యను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలోకి తీసుకున్నట్టు చెప్పారు. వారి కాల్ డేటా, వాట్సాప్ డేటా ఆధారంగా కీలక సమాచారం లభించిందని వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగించేందుకు ఢిల్లీకి ప్రత్యేక బృందాలను పంపినట్టు చెప్పుకొచ్చారు. ఈ కేసు విచారణలో మరో 8 మందిని అనుమానితులను గుర్తించామని విశాఖ సీపీ బాగ్చీ ఎన్టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Read Also: Kaantha: ‘కాంత’ దాసులయ్యేందుకు పోటీ!

అయితే,చాక్లెట్ చాక్లెట్ అనే కోడ్ భాషలో డ్రగ్స్ కొనుగోలు జరుగుతుందని టెక్నికల్ టీమ్ దీన్ని గుర్తించిందని వైజాగ్ సీపీ శంఖబ్రత బాగ్చీ చెప్పుకొచ్చారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న త్రీ టౌన్ సీఐ, ఈస్ట్ జోన్ ఏసీపీలు సెలవుపై వెళ్లడం పలు అనుమానాలు రావడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్ విభాగాలకు చెందిన 8 మంది సభ్యులతో కూడిన బృందం కస్టడీలో ఉన్న నిందితులను విచారిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తి లేదు.. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదన్నారు. డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నా వారిని పూర్తి ఆధారాలతో అరెస్టులు చేస్తామని పోలీస్ కమిషనర్ బాగ్చీ స్పష్టం చేశారు.

Exit mobile version