NTV Telugu Site icon

Cricket Betting: సంచలనంగా మారిన క్రికెట్‌ బెట్టింగ్‌ కేసు.. రూ.176 కోట్లు..!

Cricket Betting

Cricket Betting

Cricket Betting: విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు… క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా సభ్యుల్లో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసామన్నారు పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి.. ఈ ముఠాతో పెద్ద తలకాయలకు సంబంధాలు ఉన్నాయని, వాళ్లను కచ్చితంగా పట్టుకుంటామన్నారు.. క్రికెట్ బెట్టింగ్ లో ఇన్వాల్వ్ అయిన ఓ హెడ్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసి ఎంక్వయిరీకి ఆదేశించామన్నారు.. అరెస్ట్ చేసిన 8 మంది కాకుండా ఇంకా కొంతమంది ఉన్నట్లు తెలిపారు.. వాళ్ల గురించి ఎంక్వయిరీ చేస్తున్నామని.. ఇప్పటి వరకు 176 కోట్ల రూపాయల లావాదేవీలు అయినట్లు గుర్తించారు.. ఇప్పటికే క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన ముఠా సభ్యులతో పాటు వాళ్లకి సంబంధాలు ఉన్నవాళ్లు బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశామని వెల్లడించారు.. రానున్న ఐపీఎల్ సీజన్ లో క్రికెట్ బెట్టింగ్ ఆన్‌లైన్‌ ముఠాలను పట్టుకోవడానికి ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు… అయితే విశాఖ సిటీ ప్రజలే తమకు ఇన్ఫార్మర్స్ అని ఎక్కడ బెట్టింగ్ నిర్వహించిన సమాచారం ఇవ్వాలని కోరారు.. ప్రజలు ఇచ్చిన సమాచారంతోనే క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేయగలిగామన్నారు విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి.

Read Also: Nandamuri Thaman: నారా భువనేశ్వరి నోట నందమూరి తమన్ కామెంట్స్