NTV Telugu Site icon

Vizag New Year Celebrations: న్యూ ఇయర్‌ వేడుకలు.. గైడ్‌లైన్స్‌ విడుదల చేసిన వైజాగ్‌ సీపీ

Vizag

Vizag

Vizag New Year Celebrations: ప్రపంచం మొత్తం 2024కి గుడ్‌బై చెప్పి.. 2025కి ఆహ్వానం పలికేందుకు సిద్ధం అవుతోంది.. అయితే, న్యూ ఇయర్‌ వేడుకలు జరిగే సమయంలో.. ఆయా సిటీల్లో ఎక్కడిక్కడ పలు ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు.. డిసెంబర్‌ 31వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఆంక్షలు పెడుతున్నారు.. న్యూ ఇయర్‌ వేడుకల కోసం ప్రత్యేకంగా గైడ్‌లైన్స్‌ రూపొందింస్తున్నారు.. ఇక, న్యూ ఇయర్ వేడుకలకు సాగర నగరం వైజాగ్‌ ముస్తాబవుతుండగా.. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి గైడ్‌లైన్స్‌ విడుదల చేశారు పోలీస్‌ కమిషనర్‌.. ఇవెంట్స్ నిర్వహించాలనుకునే వారి నుండి దరఖాస్తులకు ఆహ్వానించారు.. అయితే, అనుమతి లేకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీస్ కమిషనర్..

Read Also: Kisan Reddy: నవంబర్ 14 బాలల దినోత్సవం మార్చాలి.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

హోటల్స్, క్లబ్‌లు, పబ్‌ల నిర్వహణలు అర్ధరాత్రి 1 గంట వరకు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు విశాఖ పోలీస్ కమిషనర్.. ఇక, ఈవెంట్స్‌ నిర్వహించే వారు.. ఎంట్రీతో పాటు.. ఎగ్జిట్ పాయింట్స్ లో సీసీ కెమెరాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు వాడితే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు.. ఇక, నోవోటేల్ హోటల్ జంక్షన్, R.K బీచ్ , భీమిలి, గాజువాక, పెందుర్తి పరిసరాల్లో “షీ-టీమ్స్” లను ఏర్పాటు చేయనున్నారు.. మద్యం తాగి వాహనం నడిపితే రూ. 10,000 జరిమానా లేదా 6 నెలల జైలుశిక్ష తప్పదని.. డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు లేదా శాశ్వతంగా సస్పెండ్ చేయబడుతుందని పేర్కొన్నారు కమిషనర్ ఆఫ్ పోలీస్ శంఖబ్రత బాగ్చి..

Show comments