NTV Telugu Site icon

Vizag Steel Plant: దిగొచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం.. విధుల్లోకి 4,200 మంది కార్మికులు

Vizag

Vizag

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికుల పోరాటం చివరికి ఫలించింది. నాలుగు రోజుల క్రితం దాదాపు 4 వేల 200 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్లాంట్ యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. దీంతో కార్మికులంతా ఒక్కటై.. వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల ధర్నాకు పలు పార్టీలు, సంఘాల నేతలు సపోర్ట్ ఇచ్చారు. కార్మికులతో కలిసి ప్లాంట్ ముందు ఆందోళన చేశారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో నిరసనలను మరింత ఉధృతం చేసేందుకు కాంట్రాక్టు కార్మికులు రెడీ అయ్యారు.

Read Also: AP Rains: ఏపీలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు..

ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగొచ్చింది. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపింది. కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు కార్మిక సంఘాల నేతల వెల్లడించారు. వారం రోజుల్లో బయోమెట్రిక్ విధానం పునరుద్ధరణ చేస్తామన్నారు. ఈ మేరకు రీజనల్ లేబర్ కమిషనర్ నోటీస్ రిలీజ్ చేసింది. దీంతో కాంట్రాక్టు కార్మికులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. ప్లాంట్‌పై ఆధారపడి బతుకుతున్న తమను తీసివేయడంతో ఎంతో ఆందోళనకు గురయ్యాం.. దిక్కు తోచని పరిస్థితిల్లోనే తాము ఆందోళన చేయాల్సి వచ్చిందని కాంట్రాక్ట్ ఉద్యోగులు పేర్కొన్నారు.

Show comments