NTV Telugu Site icon

Sourav Ganguly: ఫిట్నెస్ ఉంటే ఏ క్రీడల్లో అయినా రాణించగలం..

Ganguly

Ganguly

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన రెండు మ్యాచ్లు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో ఆడనుంది. అందులో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. తర్వాత మ్యాచ్ రేపు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఈ క్రమంలో.. సోమవారం విజయనగరం జిల్లా రాజాంలో సందడి చేసిన ఢిల్లీ జట్టు.. ఈరోజు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూట్రిషియాన్ ఫుడ్ ఫర్ జోన్ ప్లేయర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ క్రికెటర్, ఢిల్లీ జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగూలీ, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ హాజరయ్యారు.

Uttar Pradesh: మీరట్‌ రబ్బర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. ప్లేయర్స్ కు ఫిట్నెస్ చాలా ముఖ్యం అని తెలిపారు. ఫిట్నెస్ ఉంటేనే ఏ క్రీడల్లో అయినా ఉత్తమంగా రాణించగలం అని పేర్కొ్న్నారు. 400 మంది జోన్ లెవల్ ప్లేయర్స్ కు న్యూట్రిషియన్ ఫుడ్ కోసం 1.5 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గొప్ప విషయం అని అన్నారు. ఇదిలా ఉంటే.. విశాఖలో ఢిల్లీ టీంకు హాస్పిటాలిటీ చాలా బాగుందని తెలిపారు. మరోవైపు ఏసీఏ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. 400 మంది క్రీడాకారులకు న్యూట్రిషన్ ఫుడ్ అందించడానికి 1.5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ చేతుల మీదుగా క్రీడాకారులకు ఈ నగదు అందజేశామన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 365 రోజుల పాటు న్యూట్రిషన్ ఫుడ్ క్రికెటర్లకి అందిస్తున్నామని చెప్పారు. ఈ విధంగా క్రీడాకారులు ఆరోగ్యం కోసం ముందు చూపుతో న్యూట్రిషన్ ఫుడ్ కి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి అందిస్తున్నామన్నారు. దేశంలోనే ఈ విధంగా జోన్ ప్లేయర్స్ కు నూట్రిషియన్ ఫుడ్ కోసం నగదు అందిస్తున్న మొదటి క్రికెట్ బోర్డు ఏసీఏ అని తెలిపారు.

Chef Kunal Kapur: సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కి భార్య క్రూరత్వం కారణంగా విడాకులు..