విశాఖలో సంక్రాంతి సందడి మొదలైంది. సాంప్రదాయ దుస్తుల్లో యువతీ యువకులు ఎంజాయ్ చేస్తున్నారు. డు..డు.. బసవన్నలు, గంగిరెద్దుల హడావిడి మొదలైంది. తెలుగుతనం ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. మరోవైపు.. రాజ్యసభ మాజీ ఎంపీ, సీనియర్ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో పెద్ద పండుగ సంబరాలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో నాలుగు రోజుల పాటు జరిగే వేడుకలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర జానపద కళా బృందాల ఆటపాటలు, సాంప్రదాయ వేషధారణలు, రైతుల జీవన విధానం, తెలుగులోగిళ్ళలో పండుగ ప్రాసస్త్యం కళ్ళకు కట్టినట్టు చూపించే సెట్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి.
Read Also: Ramprasad Reddy: మిధున్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రాంప్రసాద్..
ఏటా జీవీఎల్ సంక్రాంతి సంబరాల పేరుతో నగర వాసులకు పండుగ సంతోషాలను మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఊళ్ళకు వెళ్ళలేని వారికి ఆ లోటు లేకుండా జరుగుతున్న ఈ వేడుకల కోసం వేలాది మంది తరలి వస్తుంటారు. కేవలం పండుగ అంటే సంబరాలు ఒక్కటే కాదని.. సమాజంలో జరుగుతున్న వివిధ అంశాలపై అవగాహన కూడా అవసరం అంటున్నారు జీవీఎల్. సైబర్ నేరగాళ్ళ బారినపడి ఏటా వందల కోట్లు లూటీ అవుతున్నందున ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ వేడుకల్లో విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం ప్రముఖ బ్యాంకుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలకు వచ్చేవారికి అవగాహన కల్పిస్తామని జీవీఎల్ చెప్పారు.
Read Also: Anshu Ambani : 23 ఏళ్ళ తర్వాత హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తున్న నాగ్ హీరోయిన్