Rs.99 Liquor Sales Starts in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త లిక్కర్ పాలసీ ప్రారంభం అయ్యింది.. ప్రభుత్వ మద్యం షాపులు మూతపడి.. ప్రైవేట్ లిక్కర్ షాపులు తెరుచుకున్నాయి.. అయితే, ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రూ.99కే నాణ్యమైన లిక్కర్.. అందుబాటులోకి రావడానికి కాస్త ఆలస్యం అయ్యింది.. ఇక ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.99 నాణ్యమైన లిక్కర్ అమ్మకాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి.. మార్కెట్‌లోకి చీప్ లిక్కర్ అందుబాటులోకి వచ్చింది.. దీంతో.. మందుబాబుల్లో హుషారు మరింత పెరిగిపోయింది.. షార్ట్స్ పేరుతో బ్రాండీ, విస్కీ అమ్మకాలు ప్రారంభం అయ్యాయి.. అయితే, పూర్తిస్థాయిలో మద్యం అందుబాటులోకి వచ్చేవరకు లిమిటెడ్ స్థాయిలో అమ్మకాలు జరగనున్నాయి.. ఇప్పుడు మాత్రం.. ఒక్కో లిక్కర్ షాపుకు మూడు నుంచి 8 కేసులు మాత్రమే సరఫరా చేస్తున్నారు.
Read Also: Pumpkin Seeds: పురుషులలో సంతానోత్పత్తి మెరుగుపడాలంటే వీటిని వాడాల్సిందే
మొత్తంగా మందు బాబులకు వారం రోజు ముందుగానే దీపావళి పండగ వచ్చినట్టు అయ్యింది.. మంగళవారం రాత్రికే లిక్కర్ షాపులకు రూ.99 లిక్కర్ చేరుకున్నట్టు షాపుల యజమానులు చెబుతున్నారు.. ఇక, మందు బాబులు దీనిపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. గతంలో క్వార్టర్ బాటిల్‌పై రూ.200 నుంచి రూ.250 ఖర్చు చేయాల్సి వచ్చేది.. దీంతో.. మా రోజు సంపాదనలో సగం దానికే ఖర్చు చేయాల్సి వచ్చేదని.. ఇప్పుడు వంద రూపాలకే క్వాలిటీ లిక్కర్ దొరకడం ఆనందంగా ఉంది.. రూ.100 లిక్కర్‌కు ఖర్చు చేసినా.. రూ.400 ఇంట్లో ఇస్తున్నానని ఓ మందు బాబు చెప్పుకొచ్చాడు..