Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేస్తే కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తాం అంటున్నారు.. రాజీనామాలు అవసరం లేదు.. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తే ఎన్డీఏ నుండి తప్పుకుంటామని చెబితే చాలు అంటూ కూటమి నేతలకు సలహా ఇచ్చారు రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు.. విశాఖపట్నంలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజ్యసభలో నేను కేంద్ర మంత్రిని అడిగితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని చెప్పారని గుర్తుచేశారు.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయ్యడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు బాబూరావు..
Read Also:Raj Gopal Reddy: మునుగోడులో వైన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..
అయితే, కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మీ స్టాండ్ ఏంటో చెప్పాలి? అంటూ నిలదీశారు.. కూటమి సపోర్ట్ వల్లే కేంద్రంలో అధికారం వున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేస్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకుటుంది? అని నిలదీశారు.. ఎన్నికల ముందు కూటమి నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయనీయబోమని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడేమో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపటానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు.. కూటమి నేతల వలన.. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది అని వ్యాఖ్యానించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు.
Read Also: Raj Gopal Reddy: మునుగోడులో వైన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..