Site icon NTV Telugu

Trains Cancelled: మెంథా తుఫాన్ ఎఫెక్ట్.. భారీగా రైళ్ల రద్దు..

Trains Cancelled

Trains Cancelled

Trains Cancelled: మెంథా తుఫాన్‌ తీరం వైపు దూసుకొస్తుంది.. దీంతో, ప్రభుత్వం వివిధ శాఖల అధికారులను అప్రమత్తం చేసింది.. మరోవైపు.. తుఫాన్‌ ప్రభావంతో రైల్వేశాఖ అప్రమత్తం అయ్యింది.. ఓవైపు తూర్పు కోస్టల్‌ రైల్వే.. మరోవైపు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు అప్రమత్తమై పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. మెంథా తుఫాన్ కదలికలపై నిరంతర పర్యవేక్షిస్తోన్న రైల్వేశాఖ.. తూర్పు కోస్టల్‌ రైల్వే జోన్ పరిధిలో హై అలెర్ట్ ప్రకటించింది.. విశాఖ మీదగా ప్రయాణించే 43 రైళ్లను రద్దు చేసింది ఈస్ట్ కోస్ట్ రైల్వే.. 27, 28, 29 తేదీలలో పలు రైళ్లు రద్దు చేసింది.. రైల్వే వంతెనలు, పట్టాలు, యార్డులు మరియు సిగ్నలింగ్ వ్యవస్థపై నిరంతర నిఘా పెట్టాలని.. అత్యవసర సేవల కోసం ప్రత్యేక రైళ్లు సిద్ధం చేయాలని.. ట్రాక్‌ల, సిగ్నలింగ్ వ్యవస్థ, విద్యుదీకరణ పునరుద్ధరణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని.. విద్యుత్ అంతరాయం సమయంలో వినియోగించుకోవడానికి డీజిల్ లోకోమోటివ్‌ లు రెడీ చేసుకోవాలని ఆదేశించింది..

Read Also: Cyclone Montha: విశాఖ, కాకినాడ సముద్ర తీరంలో అల్లకల్లోలం !

ఇక, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, దువ్వాడ, రాయగడ స్టేషన్లలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేస్తోంది.. ఈస్ట్ కోస్ట్ రైల్వే.. ప్రయాణీకుల సహాయం కోసం స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు.. రద్దు చేసిన టిక్కెట్లు వాపస్ కోసం అదనపు కౌంటర్లు… ఆహార పంపిణీ కోసం క్యాటరింగ్ యూనిట్ల ఏర్పాట్లుకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు.. బ్యాకప్ విద్యుత్ సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.. 24/7 మెడికల్ టీంలు, అంబులెన్స్ లు సిద్ధం చేసింది రైల్వో శాఖ..

మరోవైపు.. మొంథా తుఫాను దృష్ట్యా అప్రమత్తమైంది సౌత్ సెంట్రల్ రైల్వే.. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే జీఎం… రాష్ట్రంలో పర్యటిస్తోన్న సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ.. విజయవాడ డివిజన్ అధికారులతో సమావేశమయ్యారు.. తుఫాన్‌ దృష్ట్యా ప్రయాణికుల భద్రత, రైళ్ల రాకపోకల విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. అయితే, డివిజన్ లో తీసుకున్న చర్యలను జీఎంకు వివరించారు విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా.. తగు చర్యలు తీసుకోవాలని ఆపరేషన్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెడికల్ అధికారులకు జీఎం ఆదేశాలు జారీ చేశారు.. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని.. నిరంతరం అధికారులు అందుబాటులో ఉండి ప్రయాణికుల సమస్యలు పరిష్కరించాలని.. రైలు వంతెనల స్ధితి , నీటి ప్రవాహాలను ఎప్పటి కప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.. ట్రాక్ లు, బ్రిడ్జిలపై నిరంతరం పెట్రోలింగ్ టీంలు పర్యవేక్షణ చేయాలని.. అత్యవసర పరిస్దితుల్లో వేగంగా చేరుకునేందుకు సర్వం సిద్దం చేయాలని.. డీజిల్ లోకో మోటివ్ లు, మొబైల్ రెస్క్యూ టీంలు నిరంతరం అందుబాటులో ఉంచాలని.. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎప్పటి కప్పుడు రైళ్ల రాకపోకలపై నిర్ణయం తీసుకోవాలని.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ తగు నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ..

Exit mobile version