విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి లేవనెత్తారు. ఇదే అంశంపై ఇటీవల ఆయన విశాఖలో బహిరంగ సభ నిర్వహించగా.. ఈరోజు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారులు, పోలీస్ కాల్పుల్లో అమరులైన వారి పేర్లను ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఉద్యమం సమయంలో ఏం జరిగిందో ఆనాటి కొన్ని దినపత్రికలు ప్రచురించిన ఆర్టికల్స్‌ను కూడా పవన్ షేర్ చేశారు.
విశాఖ ఉక్కు కోసం ఉద్యమించిన వారిపై పోలీసులు తూటాలు పేల్చి లాఠీలు ఝళిపించగా సమైక్య రాష్ట్రంలో 32 మంది అశువుల బాశారు. వీరిలో విశాఖకు చెందిన 12 మంది, విజయవాడకు చెందిన ఐదుగురు, గుంటూరుకు చెందిన ఐదుగురు, విజయనగరంకు చెందిన ఇద్దరు, కాకినాడకు చెందిన ఒకరు, పలాసకు చెందిన ఒకరు, వరంగల్‌కు చెందిన ఒకరు, జగిత్యాలకు చెందిన ఒకరు, సీలేరుకు చెందిన ఒకరు, రాజమండ్రికి చెందిన ఒకరు, ఇతర ప్రాంతాలకు చెందిన ఇద్దరు ఉన్నారు.
Read Also: ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము.. చిన్నారి మృతి
