Vizag Central Jail: విశాఖపట్నం సెంట్రల్‌లో జైలులో వరుసగా సెల్‌ఫోన్లు బయటపడుతూనే ఉన్నాయి.. సెంట్రల్ జైలులో మరోసారి సెల్‌ఫోన్ కలకలం సృష్టించింది.. నెల రోజుల వ్యవధిలోనే ఇప్పటి వరకు ఆరు సెల్‌ఫోన్లును గుర్తించారు జైలు సిబ్బంది.. దీంతో, విశాఖ సెంట్రల్ జైల్ లో పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ సెల్ ఫోన్స్ వెనుక ఎవరు ఉన్నారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. అయితే, ఈ రోజు మరో సెల్ ఫోన్ గుర్తించారు జైల్ అధికారులు.. నెల రోజుల వ్యవధిలో ఆరు సెల్ ఫోన్లు లభ్యం కావడంపై దృష్టిసారించారు అధికారులు.. హోం మంత్రి వంగలపూడి అనిత సెంట్రల్ జైలును పరిశీలించిన మూడు రోజులలో మరో సెల్ ఫోన్ అధికారులకు దొరకడం చర్చగా మారింది.. ఇక, సెల్‌ఫోన్‌ను గుర్తించిన జైలు అధికారులు.. ఆరీలోవ పోలీసులకి ఫిర్యాదు చేశారు.. అయితే, సెల్ ఫోన్స్ ఎవరివి? ఎక్కడ నుండి వస్తున్నాయి? ఎవరు వినియోగిస్తున్నారు..? అనే దానిపై ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు జైలు అధికారులు.
Read Also: YS Jagan: వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇప్పటి వరకు ఒకలా.. ఇకపై మరోలా చూస్తాం..