Minister Narayana: ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో ఆక్రమణకు గురైన భూములను స్వచ్చందంగా స్వాధీనం చెయ్యాలన్నారు.. లేదంటే ప్రభుత్వం ఆ పని చేస్తుందని స్పష్టం చేశారు. ఇక, వచ్చే నెలాఖరులోగా టీడీఆర్ బ్లాండ్లపై స్పష్టత వస్తుందని బాధ్యులపై చర్యలు తప్పవన్నారు నారాయణ. మరోవైపు, రుషికొండ భవనాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారని, వాటి వినియోగంపై అందరి అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. కాపాలుప్పాడ డంపింగ్ యార్డ్ నిర్వహణ , సాలీడ్ వెస్ట్ మేనేజిమెంట్ ప్లాంట్ పనితీరు పరిశీ లించిన మునిసిపల్ శాఖమంత్రి నారాయణ.. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి అన్నారు. గత ఐదేళ్లలో ఒక్క మంత్రి ఈ ప్లాంట్‌ను పరిశీలించలేదు. రెండు నెలలు నుంచి మునిసిపల్ శాఖ ను చూస్తే అస్తవ్యస్తంగా చేశారన్నారు.
Read Also: Ponnam Prabhakar: ముంబై తో సమానంగా గణేష్ ఉత్సవాలు..
ఇక, 15 వ ఫైనాన్స్ కమిషన్ కు మాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. వైసీపీ హయాంలో 2023 లో 450 కోట్లు ఇస్తే వాటిని పక్కదారి పట్టించారని విమర్శించారు నారాయణ.. స్వచ్ఛ భారత్ లో 295 కోట్లు రావాలి, మాచింగ్ గ్రాంట్ 120 కోట్లు ఇవ్వలేదు.. మళ్లీ కూటమి ప్రభుత్వంవచ్చాక వాటిని వచ్చేలా చేసినట్టు వివరించారు. టీడీఆర్ కుంభకోణాలు మీద త్వరలో స్పష్టత వస్తుందన్నారు. సెప్టెంబర్ 13 న మరో 75 అన్న కాంటీన్లు ప్రారంభిస్తామని వెల్లడించారు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ.
