NTV Telugu Site icon

Minister Nadendla Manohar: యువత కోసం పవన్‌ కల్యాణ్‌ తపన.. ఉత్తరాంధ్రకు భారీ పెట్టుబడులు వస్తాయి..!

Nadendla Manohar

Nadendla Manohar

Minister Nadendla Manohar: యువత కోసం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తపన పడుతున్నారు.. ఉత్తరాంధ్రకు భారీ పెట్టుబడులు వస్తాయని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్‌.. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఉత్తరాంద్ర యువతకు ఉపాధి కల్పించాలని తపన పడుతున్నతారు.. ఉత్తరాంద్రకు భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. దీపం పథకం -2, లో భాగంగా 99 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ అందించాము. గతంలో ఎప్పుడు లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసి 24 గంటలలో రైతులకు డబ్బులు అందించాం.. మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నాం.. పవన్ కల్యాణ్‌ గిరిజన గ్రామాలలో పర్యటించి రోడ్లకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

Read Also: Minister Nara Lokesh: విశాఖను ఒక బ్రాండ్‌గా మారుస్తాం.. 2029లోపు 5 లక్షల ఐటీ ఉద్యోగాలు..

ఇక, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో అభివృద్ధి, సంక్షేమం అందించదనికి ప్రణాళిక తయారుచేసుకున్నాం అన్నారు నాదెండ్ల మనోహర్‌.. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ విజయవంతం అయ్యిందన్న ఆయన.. సభ విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.. అన్ని స్థాయిలలో కమిటీలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.. టీడీపీ, బీజేపీతో కలసి ప్రజలు కోసం అంకితభావంతో జనసేన నాయకులు పనిచేయాలని సూచించారు.. గత ప్రభుత్వంలో విశాఖపట్నరంలో లాండ్ అడర్ సమస్య సృష్టించారు. ఋషికొండలో ప్రజాధనంతో ప్యాలస్ నిర్మించారు. విశాఖలో భూకబ్జాలకు పాల్పడ్డారు, పర్యావరణం విధ్వసం చేశారని మండిపడ్డారు మంత్రి నాదెండ్ల మనోహర్‌..