Site icon NTV Telugu

Hostels Closed at Andhra University: భారత్-పాక్‌ వార్.. ఏయూలో హాస్టళ్లు మూసివేత..!

Au

Au

Hostels Closed at Andhra University: భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రికత్తలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఓవైపు పాకిస్తాన్‌.. జనావాసాలను టార్గెట్‌ చేస్తూ కాల్పులు జరుపుతోంది.. మరోవైపు డ్రోన్లతో భారత్‌పై దాడి చేస్తుండగా.. డ్రోన్లను కూల్చివేస్తూనే.. పాక్‌ కాల్పులను తిప్పికొడుతోంది భారత్‌.. ఇంకోవైపు.. పాకిస్తాన్‌పై విరుచుకుపడుతోంది.. అయితే, ఈ పరిస్థితుల నేపథ్యంలో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో నేటి నుంచి హాస్టళ్లు తాత్కాలికంగా మూసివేశారు వర్సిటీ అధికారులు.. భారత్-పాక్‌ యుద్ధం కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు ముగిసిన వారు వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. భద్రతా కారణాలతో పాటు నీటి ఎద్దడి, వార్షిక మరమ్మత్తుల కోసం కూడా హాస్టళ్లు మూసివేస్తున్నట్టు ప్రకటించారు ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్.

Read Also: IndiaPakWar: టర్కీ డబుల్ గేమ్.. పాక్కి డ్రోన్ల సరఫరా.. పహల్గామ్ మృతులకు సంతాపం

Exit mobile version