ఇటీవలే కాలంలో దేశ వ్యాప్తంగా విమానాల్లో బాంబు బెదిరింపులు కలవరపెడుతున్న సంగతి తెలిసిందే.. అయితే.. వెంటనే అప్రమత్తమై చూస్తే అంతా ఫేక్ అని తేలిపోతుంది. ఈ క్రమంలో.. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారం జరుగుతోందన్నారు. బాంబు బెదిరింపులపై లోతైన దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. విచారణ తరువాత బాంబు బెదిరింపులు తప్పుడు ప్రచారం వెనుక ఎవరున్నారనే దానిపై స్పష్టత వస్తుందని వివరించారు. అయినప్పటికీ.. విమానాల్లో బాంబు బెదిరింపు కాల్స్ ఆగడం లేదు.
Read Also: Mahesh Babu: శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు.. ఇక థియేటర్లకు సెక్యూరిటీ రెడీ చేసుకోండమ్మా!!
తాజాగా.. విశాఖకు వెళ్లిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విశాఖకు వెళ్లాల్సిన విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కాగా.. అప్పటికే విమానం విశాఖకు బయలుదేరింది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు ఇచ్చిన సమాచారంతో విమానం విశాఖలో ల్యాండింగ్ అయిన తర్వాత అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో ఎలాంటి అనుమానిత సమాచారం లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మూడున్నరకు తిరిగి వెళ్లాల్సిన విమానం రెండు గంటల ఆలస్యం అయింది. కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం నుంచి ముంబై వెళ్లింది ఇండిగో ఫ్లైట్.
Read Also: AP High Court: మాజీ మంత్రి బాలినేని పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు..