Heavy Rain Forecast: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన ఉందని చెబుతోంది వాతావరణ శాఖ.. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ముఖ్యంగా ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, మన్యం, ఏలూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, రెండు రోజుల్లో మధ్య బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించబోతున్నాయి.. మరోవైపు, రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనాల ప్రభావం కొనసాగుతోంది.. వీటి ప్రభావంతో.. వచ్చే ఐదు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. గంటకు 40- 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది..
Read Also: CM Revanth Reddy: హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
అయితే, ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.. కొన్ని చోట్ల వర్షాలు దంచికొడుతుంటే.. మరికొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి.. జంగమేశ్వరపురంలో 41 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.. వచ్చే ఐదురోజులు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.. ఇక, గత 24 గంటల్లో గుంటూరులో అత్యధికంగా 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. బాపట్ల 9.5, అమలాపురం 83.8, గుడివాడ 82.8, లామ్, సత్తెనపల్లిలో 6.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ప్రీ మాన్ సూన్ ప్రారంభమైనట్టు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం నిర్ధారించింది..
