YSRCP vs TDP Fight: విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ కౌన్సిల్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిల్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ వ్యక్తమైంది. దీంతో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య ఈ అంశంపై తోపులాట జరిగింది. కౌన్సిల్ అజెండా ముందుకు తీసుకెళ్లే ముందు స్టీల్ ప్లాంట్ ఇష్యూ పరిష్కారం కావాలని వైసీపీ సభ్యులు పట్టుపట్టారు. స్టీల్ ప్లాంట్ సమస్య తేలే వరకు కౌన్సిల్‌లోని ఇతర అంశాలపై చర్చ జరగకూడదని వారు డిమాండ్ చేశారు.
Read Also: Anupama Parameswaran: 10 ఏళ్ల తెలుగు జర్నీ – ఎప్పటికీ ఫ్రెష్ ఫీలింగ్!
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. సభ్యులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం ప్రతిపాదిస్తే దానిని ఆమోదించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వైసీపీ కార్పొరేటర్ల తరఫున నలుగురు అంశాలను ప్రతిపాదిస్తూ ప్రత్యేక తీర్మానం సమర్పించారు. జీవీఎంసీ కౌన్సిల్‌లో జరిగిన ఈ చర్చలతో విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయింది.
