Site icon NTV Telugu

Gudivada Amarnath: స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు మేం ఎప్పుడూ వ్యతిరేకమే..

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath: స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎప్పుడూ వ్యతిరేకమే అని స్పష్టం చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఈ నెల 9వ తేదీ వైఎస్‌ జగన్‌ పర్యటనపై విశాఖలో సన్నాహక సమావేశం నిర్వహించారు.. 7 నియోజకవర్గాల మీదుగా రోడ్ షోగా వెళ్లే అవకాశంపై చర్చించారు.. ఈ సందర్భంగా… గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డిని స్టీల్ ప్లాంట్, షుగర్ ఫ్యాక్టరీ, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు కలుస్తారని తెలిపారు.. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకమే అని పేర్కొన్న ఆయన.. కేంద్రం చేస్తున్న ఆలోచనలు తెలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. వాటిని అడ్డుకోవడంలో విఫలం అయినందున రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.. చంద్రబాబులా అధికారంలో వున్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాటను వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మాట్లాడరని తెలిపారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక స్టీల్ ప్లాంట్ లో దాదాపు 10 వేల మంది ఉద్యోగాలు పోయాయి.. కూటమి ప్రభుత్వం పేదవారి కడుపు కొడుతుందని మండిపడ్డారు. పేదవాడికి ఉచిత వైద్యం అందడం ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేకే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు… చంద్రబాబు చీటర్, లోకేష్ లూటర్ అని జనం మాట్లాడుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్..

Read Also: Amitabh Bachchan: గృహిణులమని గర్వంగా చెప్పండి..ఇంటిని చక్కబెట్టడం ఈజీ కాదు

Exit mobile version