NTV Telugu Site icon

Ramanaidu Studio Lands: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రామానాయుడు స్టూడియో భూ కేటాయింపు రద్దు..!

Ramanaidu Studio Lands

Ramanaidu Studio Lands

Ramanaidu Studio Lands: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామానాయుడు స్టూడియో భూములపై కీలక నిర్ణయం తీసుకుంది.. విశాఖలోని రామానాయుడు స్టూడియోలో 2023లో నివాస లే ఔట్ కు కేటాయించిన 15.17 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.. కేవలం ఫిలిం స్టూడియో, అనుబంధ అవసరాలకు మాత్రమే వాడాలని 2010లో సురేష్ ప్రొడక్షన్స్ కు మధురవాడ గ్రామ సర్వే నెంబర్ 336లో మొత్తం 34.44 ఎకరాల భూమిని కేటాయించింది.. అయితే, 2023 మార్చ్ లో 15.17 ఎకరాలలో నివాస లే ఔట్ కు gvmc నుంచి ప్లాన్ అనుమతి పొందింది సురేష్ ప్రొడక్షన్స్.. ఫిలిం స్టూడియో అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన భూమిని ఇతర అవసరాలకు వాడటంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.. విచారణ చేసి భూ వినియోగ మార్పు హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా నివేదిక అందజేశారు..

Read Also: CM Revanth Reddy: హైదరాబాద్​ లో భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

దీంతో, నిబంధనలు ఉల్లఘించినందుకు ఆ 15.17 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.. మిగిలిన భూమిపైనా కఠినమైన నియంత్రణ ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం.. ఈ వ్యవహారంలో సురేష్ ప్రొడక్షన్స్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.. VMRDA, GVMC కమిషనర్లు భూస్వామ్య మార్పుకు అంగీకరించకూడదని ఆదేశించింది.. జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని.. రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా స్పష్టం చేశారు..